Wednesday, August 12, 2026

ఆటో డ్రైవర్ల పొట్ట కొడ్తున్నారు: మంద రవికుమార్

పెద్దపల్లి, నిఘా న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను మభ్య పెట్టడం మానుకొని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ నాయకులు మంద రవికుమార్, అన్నారు. ఆగస్టు 1వ తేదిన ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భం గా గోదావరిఖని బస్టాండ్ అడ్డాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్,ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హు లైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు ఇవ్వాలని, ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ప్రభు త్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. స్వాతంత్రం వచ్చిన ప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులను చూసాం కాని, కార్మికుల పొట్టలు కొట్టే ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడ లేదని అన్నారు.

ఇచ్చిన హామీలను మరిచి మళ్లీ కొత్తగా ఆటో డ్రైవర్లను మోసం చేయడా నికి,,ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైలు వరకు ఆర్టీసీ ఆటోలు అనే కార్యక్రమాన్ని తీసుకు రావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నా రు.ఆటో డ్రైవర్లను మోసం చేసే ఇలాంటి పథకాలను మేము సహించబోమని మంద రవికుమార్, హెచ్చరించారు.

రామగుండం కార్పొరేషన్ ఆటో జేఏసీ అధ్యక్షులు ఎండి బురహన్, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కో కన్వీనర్ ఎస్ కే జబ్బర్, జిల్లా నాయకులు కాజీపేట రాజయ్య, పల్లెబాపు, రాజేశం, మడిపెద్ది రమేష్, షరీఫ్ తదితరులు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular