Tuesday, September 22, 2026

పోటీ పరీక్షల సిలబస్ పై టీజీ పీఎస్పీ కీలక ప్రకటన!

హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సిలబస్ మార్పులపై వస్తున్న ఊహగానాల కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సమాచారం అందించింది, పలు రిక్రూట్మెంట్ పరీక్షల సిలబస్ లో మార్పు లు జరుగుతున్నాయి అంటూ అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు సందేహాలు వస్తున్న నేపథ్యంలో కమిషన్ స్పందిస్తూ.. అధికారి కంగా ఒక ప్రకటన విడుదల చేసింది…

ఈ నేపథ్యంలో స్పం దించిన కమిషన్‌.. ప్రస్తుతం ఎలాంటి సిలబస్‌ కమిటీని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది. సిలబస్‌లో పెద్దస్థా యిలో మార్పులు చేయాలని భవిష్యత్తులో నిర్ణయి స్తే, అభ్యర్థులకు తగినంత సమయం ఇచ్చేలా కనీసం ఏడాది ముందుగానే సమాచారం అంది స్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

అదేవిధంగా సిలబస్‌ లో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటే వాటిని కూడా అభ్యర్థులకు తెలియ కుండా చేయబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసే సమయంలోనే సవరించిన సిలబస్‌ వివరాలను అధికారి కంగా వెల్లడిస్తామని పేర్కొంది. సిలబస్‌ మార్పులపై వస్తున్న అనధికారిక ప్రచారా న్ని ఆధారంగా చేసు కుని తమ ప్రిపరేషన్‌ ను మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

పోటీ పరీక్షలకు సం బంధించిన సిలబస్‌, పరీక్ష విధానం, అర్హతలు, నియామక ప్రక్రియ వంటి అంశాల్లో సోషల్‌ మీడియా లేదా ఇతర అనధికారిక వేదికల్లో వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకో వద్దని కోరారు. టీజీపీ ఎస్సీ అధికారికంగా విడుదల చేసే నియామక ప్రకటన, సిలబస్‌ వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular