హుజూరాబాాద్, నిఘా న్యూస్: హుజురాబాద్ పట్టణంతో పాటు హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా డిటిసిపి అప్రూవల్ లేకుండా ఇష్టానుసారంగా లేఅవుట్లు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో యదేచ్ఛగా ప్రభుత్వ చెరువులను కబ్జా చేసి ఇష్టానుసారంగా లేఅవుట్లు నిర్మించాలని అదేవిధంగా హుజురాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా డిటిసిపి అప్రూవల్ లేకుండా వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చడంతో పేద మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తే ఇబ్బందుల పాలు అవుతారని మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువస్తూ వెంటనే అక్రమ వెంచర్ల నిలిపివేసి అక్రమ దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపైన స్పందించిన కలెక్టర్సం బంధిత శాఖ అధికారులను వెంటనే విచారణ చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు.