Tuesday, April 14, 2026

గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

జగిత్యాల, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో ఇవ్వాళ కీలక పరిణామా లు చోటు చేసుకుంటున్నా యి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, గురువారం మధ్యాహ్నం స్వయంగా జగిత్యాల లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

మాజీ మంత్రి కేటీఆర్ రాకతో జగిత్యాల అంతటా బిఆర్ఎస్ పెక్సీలు వెలిశా యి అయితే కేటీఆర్ తో పాటు.. జీవన్ రెడ్డి, ఫోటో కూడా ఫ్లెక్సీలో ప్రముఖంగా కనిపిస్తుంది,దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకో వడం దాదాపు ఖాయమం టున్నారు ఆయన సన్నిహితులు…

2014 ఎన్నికల ముందు కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ జీవన్ రెడ్డి, నిబద్ధత గల నాయకుడని కాంగ్రెస్ లోనే కొనసాగారని చెప్పారు. కెసిఆర్ సూచన మేరకే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని చెప్తానని అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular