ముగ్గురిపై కేసు నమోదు
కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ గోపాల్ పూర్ రేషన్ డీలర్ అయిన బెజ్జంకి అంజయ్య తండ్రి లచ్చయ్య, ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయు రేషన్ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరకు విక్రయించేందుకు, దుర్శేడ్ గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు యజమాని అయిన మొగసాల సంతోష్ రెడ్డి కి రైస్ మిల్లుకు తరలిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడిలో ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 810 సంచుల బియ్యాన్ని దాదాపు 504 క్వింటాళ్లు పట్టుకున్నారు. తరలించేందుకు ఉపయోగించిన ట్రాలీ వాహనాన్ని సైతం సీజ్ చేసి ముగ్గురిపై రేషన్ డీలర్ అంజయ్య , వెంకటేశ్వర రైస్ మిల్లు యజమాని సంతోష్ రెడ్డి , ట్రాలీ డ్రైవర్ మధుల పై 420 ఐపీసీ , సెక్షన్ 07 ఆఫ్ EC యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ తెలిపారు.