కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ సిఐగా ఓ రమేష్ శుక్రవారం సాయంకాలం పదవీ బాధ్యత స్వీకరించారు. గతంలో చొప్పదండి మండలం సీఐగా పని చేసి ఆ తరువాత వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలంలో సిఐగా పని చేశారు. అంతకుముందు కరీంనగర్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. ఇటు సీఐగా చేసిన అనుభవం తో పాటు శాంతి భద్రతల విషయంలో అటు ప్రజలతో మమేకమై ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ టుటౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు.
