పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమ య్యే ప్రయాణికుల రద్దీ రాత్రి 10-11 గంటల వరకు కొనసాగుతుంటోంది వివిధ డిపోలకు చెందిన బస్సు సర్వీసులు కూడా మంథని బస్టాండు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బస్టాండ్‌లో ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వలన కనీస సౌకర్యా లు కరువయ్యాయి.
వేసవి తీవ్రతతో ప్రయాణికులు దాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పైన రెండు వాటర్ ట్యాంకులు ఉండగా వాటిని శుభ్రం చేయకపోవడం, వాటిపై మూతలు లేకపోవడంతో వాటర్ ట్యాంక్ లో కోతులు స్థానం చేయడం, ఆ నీటిని తాగడం, పైగా చెత్తా, చెదారం,పడి కలుషితమైన ఆ నీరు పరిశుభ్రంగా లేకపో వడంతో తాగేందుకు ప్రయాణికులు ఇష్టపడం లేదు.
మంచినీటి సౌకర్యం లేక ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కండక్టర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మంథని బస్టాండ్ లో నీరు, కావాలంటే కొనుక్కో వాల్సిందే మంథని బస్టాండ్ లో ఏర్పాటు చేసిన ఫ్రిజ్ పనిచేయ డం లేదు, దీంతో దుకాణాల వద్ద రూ.20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఎక్కువ ధరకు మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు.
వేసవి కాలం పైగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం కాగా.. ప్రయాణికుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఆర్టీసీ అధికారులు కనీసం తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


