Wednesday, August 12, 2026

మోస్ట్ వాంటెడ్ హంతకుడు ఆత్మహత్య!

హైదరాబాద్, నిఘా న్యూస్:రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపిన షాబాద్‌ ఆరు హత్యల కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్.. సూసైడ్ చేసుకున్నా డు. తన మేనమామ ఊరు అయిన కొత్తూ రులోని ఓ వెంచర్‌ వద్ద రాజ్‌కుమార్ మృతదే హాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించగా..

రంగంలోకి దిగిన అధికారులు.. అక్కడ పరిశీలన చేశారు. ఓ బాలికపై లైంగిక వేధిం పులకు పాల్పడిన వ్యవహారంలో రాజ్‌ కుమార్‌ పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న రాజ్‌ కుమార్.. బాధిత బాలికతోపాటు తల్లి, నానమ్మను.. తన భార్య, ఇద్దరు పిల్లల ను కలిపి మొత్తం ఆరుగురిని ఒకే రాత్రి లో అతి కిరాతకంగా హతమార్చాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసుల కు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం తో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతుడిని గుర్తించారు.

షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ అని గుర్తించారు. రాజ్‌ కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యం కావడంతో.. అతడు పాయిజన్ తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగురిని చంపేయ డంతో తనను పట్టు కునేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతుండటంతో తీవ్ర భయాందోళనలకు గురై.. ఎటూ తప్పించు కుని పోయే అవకాశం లేకపోవడంతో అతడు పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక హత్యలు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిష నరేట్ పోలీసులు సుమారు 14 ప్రత్యేక బృందాలతో విస్తృతం గా గాలింపు చేపట్టా రు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో అతడికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదని.. చివరికి కొత్తూరు మండలం లోని తన మేనమామ ఊరైన పంజర్లకు చేరు కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ శివారులోనే పురుగుల మందు తాగి చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular