గంగాధర (నిఘా న్యూస్):-గంగాధర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గంగాధర గ్రామానికి చెందిన మంత్రి లత ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియమించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే సత్యం చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లత మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో పూర్తిస్తాయిలో కమిటీలు వేసి మహిళా కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట కరుణాకర్, రాచమల్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి రుద్ర మల్లేశం, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బూరుగు గంగన్న, యువ నాయకులు పడాల రాజన్న, మండల కార్యదర్శి నాగేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కరుణాకర్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.