Friday, March 6, 2026

మావోయిస్టు అగ్రనేత కల్పన అరెస్టు?

హైదరాబాద్, నిఘాన్యూస్:మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది, మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా తెలిసింది…ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మావోయిస్టుల ఆపరేషన్ల లో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటికిపై గా రివార్డు ఉంది.

ప్రస్తుతం ఆమె బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. మహబూబ్ నగర్‌కు చెందిన కల్పన అలియాస్ సుజాతను పోలీసులు విచారిస్తున్నారు.మావోయిస్టులకు సంబం ధించిన కీలక సమాచా రాన్ని ఆమె నుండి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో సుజాత పని చేశారు.

కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.మృతులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ, పీఎల్‌జీఏ,6వ కంపెనీ, తూర్పు బస్తర్‌ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular