నగర కాంగ్రెస్ అధ్యక్షుడు,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ నిఘా న్యూస్) పదవికోసం కోవర్ట్ గా మారి అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిన చరిత్ర కౌశిక్ రెడ్డి ది అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎన్నో సందర్భాలలో వివాదాస్పదమైన వాఖ్యలు మాట్లాడిన కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని నరేందర్ రెడ్డి అన్నారు.కేసిఆర్ నియంత పాలనలో అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వని వీళ్ళు ఇప్పుడు అధికారం కోసం ఆరాటపడడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.స్థాయికి మించి విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎవరి సత్తా ఎంటో తేలిపోతుందని పార్లమెంట్ ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారబోతోందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.