Sunday, April 19, 2026

ఈనెల 15 న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు?

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం..వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిం చిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.

గత అనుభవాలను దృష్టి లో ఉంచుకుని, ఈసారి ఫలితాల విషయంలో ఇంటర్ బోర్డు అత్యంత అప్రమత్తంగా వ్యవహరి స్తోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లకుండా డబుల్ చెక్ పద్ధతిని అనుసరిస్తున్నా రు. ఇప్పటికే ఒకసారి వాల్యూయేషన్ పూర్త యినప్పటికీ, అత్యున్నత ప్రమాణాల కోసం మరోసారి ఫలితాలను పరిశీలిస్తున్నారు.

ముఖ్యంగా కేవలం ఒకే ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తు న్నారు. అటువంటి విద్యార్థుల సమాధాన పత్రాలను మరోసారి రీ-వాల్యూయేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల పొరపాట్లు జరిగి విద్యార్థు లు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితాల వెల్లడికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్, ఆయన లభ్యత ఆధారంగా ఫలితాల తేదీని అధికారికంగా ఖరారు చేయనున్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular