హైదరాబాద్ , నిఘా న్యూస్: స్త్రీ లేకపోతే మనిషి జననం లేదు, అసలు సృష్టే లేదు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుం టూ… ముందు తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 08న అంతర్జా తీయ మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నాం మహిళలు నేడు అనేక రంగాల్లో అనేక విజయాలు సాధిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజ కీయ రంగాల్లో మహిళలు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తున్నారు.
ఈ ఏడాది మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం give To Gain దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా విరాళం ఇవ్వడానికి పిలుపు. ఒకరికి ఒకరు తోడుగా నిలబడడం మహిళలకు చదువు, శిక్షణ,మంచి అవకాశాలు కల్పించడం మగవారితో సమానంగా జీతం,గౌరవం, ఇవ్వడం కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మనకున్న జ్ఞానాన్ని,వనరులను, పంచుకోవడం ద్వారా మహిళలను పైకి తీసుకురావడం మహిళలు అభివృద్ధి చెందితే మొత్తం సమాజమే పురోగమిస్తుంది అనేది ఈ ఏడాది ముఖ్య సందేశం…
మహిళా సమానత్వ సాధనలో మరింత ముమ్మర కృషి చేయాలని పిలుపిస్తూ ఏటా మార్చి ఎనిమిదో తేదీన అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నాం. లింగ సమానత్వం వెల్లివిరిసే ప్రపంచం మరింత ఆరోగ్య వంతంగా, సుసంపన్నంగా, సామరస్యంగా కళకళలా డుతుంది. ఐక్యరాజ్య సమితి 2030కల్లా సాధించాలని తీర్మానించిన సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల్లో అయిదోది- మహిళలు, బాలికలకు సమానత్వం, సాధికారత…
ఇది మానవాళి ప్రగతికి ఊతమిచ్చే లక్ష్యం. ‘స్త్రీ మేధాపరంగా, మానసి కంగా, ఆధ్యాత్మికంగా పురుషుడికి సమఉజ్జీ. ఆమె ఎటువంటి కార్యక లాపాల్లోనైనా మగవారికి దీటుగా రాణించగలదు’ అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇతర దేశాల మహిళలకు, భారతీయ మహిళలకు మధ్య పోలికలు, తేడాలను, సమానత్వ సాధనలో భారతీయ మహిళకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించడం అవసరం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం- ‘నేను సమతా తరాన్ని: మహిళా హక్కులు సాధిస్తా’. పదహా రేళ్ల స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థున్బెర్గ్ వాతావరణ మార్పులను నిరోధించా లంటూ చేపట్టిన ఉద్యమం ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు పొందింది. తనతోపాటు భావితరం హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు.
అభిజిత్ బెనర్జీ, మైకేల్ క్రెమెర్లతోపాటు ఎస్తర్ డఫ్లో ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి సాధించారు. 1969లో ఈ బహుమతిని ఇవ్వనారంభించినప్పటి నుంచి దాన్ని పొందిన రెండో మహిళ ఆమె. నోబెల్ ఆర్థిక బహుమతిని అందుకున్నవారిలో అత్యం త పిన్నవయస్కురాలు కూడా డఫ్లోనే. ఫిన్లాండ్కు ప్రధానమంత్రిగా ఎన్నికైన మరీన్ సనా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగా చరిత్రకెక్కారు. ఇలా అనేక రంగాల్లో ప్రకాశిస్తున్న మహిళలు ప్రపంచమంతటా కనిపిస్తారు.
అన్ని రంగంల్లో రాణిస్తున్న ఆధునిక స్త్రీ
భారతదేశంలో ఆర్థిక, వ్యాపార, రక్షణ, విద్య, క్రీడా, రాజకీయ, సాహిత్య, సంగీత, కళారంగాల్లో ఉన్నత స్థానాలను మహి ళలు అలంకరిస్తున్నారు. విమానాలను నడిపే పైలెట్లుగా ముందంజ వేస్తున్నారు. గతేడాది స్విట్జర్లాండ్లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన తొలి భారతీయ మహిళ పీవీ సింధు. భారతదేశానికి పూర్తికాల ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న తొలి మహిళ నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మహిళా స్వయంసహాయక సంఘాలు, కేరళలో కుటుంబశ్రీ కార్యక్రమం స్త్రీల చొరవతోనే విజయవంతమయ్యాయి.
చాలామంది మహిళలు పంచాయతీ సర్పంచులు గా చక్కని పనితీరు కనబరుస్తున్నారు. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా భారత సైన్యంలో నియమితులైన మహిళా అధికారులకు వారి సర్వీసు కాలంతో నిమిత్తం లేకుండా శాశ్వత హోదా, కమాండ్ పదవులను ఇచ్చే విషయం పరిశీలించాలని గత నెల లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక రూలింగ్ ఇచ్చింది. దీన్ని కాదనడం సమానత్వ సూత్రాన్ని పాటించే చట్టాలకు విరుద్ధం కాబట్టి ప్రతికూల మనస్తత్వాన్ని మార్చుకోవాలని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
తీరు మారాలి..!
మహిళలు- పురుషులతో పోలిస్తే శారీరకంగా బలహీనులని, అబలలని భావిస్తూ పోరాట విధులకు వారిని దూరంగా పెడుతున్నారు. కార్మిక విపణిలో భారతీయ మహిళల భాగస్వామ్యం బాగా తక్కువగా ఉండటం, ఇక్కడ లింగ అసమానత్వానికి ప్రధాన కారణం. 2004-05లో 45.4 శాతంగా ఉన్న మహిళా భాగస్వామ్యం తరవాత 20 శాతం తగ్గి 2017-18కల్లా 25.3 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో బయటి పనులు వదలి ఇంటి పనులకే పరిమితమైన మహిళల సంఖ్య 46 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది.
ఆర్థిక మందగతి వల్ల ఉపాధి అవకాశాలు క్షీణించడం దీనికి కారణంగా చెప్పుకోవాలి. మహిళా భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ‘ముద్ర, స్టాండప్ ఇండియా, భద్రమైన గృహవసతి, రాష్ట్రీయ మహిళా కోశ్, జాతీయ గ్రామీణ జీవనాధార యోజన’ వంటి పథకాలను చేపట్టింది. పని స్థలాల్లో మహిళా భద్రతకు చర్యలు తీసుకుంది. ఎంత చేసినా మహిళా భాగస్వామ్యం అంచనాల మేరకు లేకపోవడం గమనార్హం.


