కరీంనగర్ మార్చి 14(నిఘా న్యూస్): కరీంనగర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయ కమ్యూనిటీ భవనానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అందించిన పది లక్షల నిధులతో అదనంగా మరో 10 లక్షల నిధుల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారు. గురువారం రేణుక ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సమావేశమైన కరీంనగర్ గౌడ కుల ప్రతినిధులు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌడ కుల ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎల్లమ్మ జాతర సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ దేవాలయాన్ని సందర్శించి 10లక్షల రూపాయలు కమ్యూనిటీ భవనము మంజూరు చేయించి భవన నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా ఈ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఎంపీ బండి సంజయ్ మిగతా పనుల కోసం 10లక్షలు అందిస్తానని చెప్పి , 11వ తేదీన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి మరొక 10లక్షలు విడుదల చేశారని పేర్కొన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు అందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోడూరి మహేందర్ గౌడ్, హరి కుమార్ గౌడ్,బత్తిని రాజు గౌడ్,పంజాల సురేందర్ గౌడ్, మహేందర్ గౌడ్ (అడ్వకేట్), సుదగోని ఆంజనేయులు గౌడ్, బండారి గాయత్రి గౌడ్, బత్తిని అనిల్ గౌడ్, బుర్ర సతీష్ గౌడ్, కోడూరి లక్ష్మణ్ గౌడ్, కోడూరి సంపత్ గౌడ్, దుర్గం మురళీ గౌడ్, కోడూరి సతీష్ గౌడ్,వంగ హరీష్ గౌడ్, కోడూరి తిరుపతి గౌడ్ ,ఆలయ పూజారి కోడూరి సురేష్ గౌడ్, పలువురు గౌడ సోదరులు పాల్గొన్నారు.