వరంగల్, నిఘా న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించక పోవడంతో ఆయన మరణించారు.
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీ ఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పార్టీ నేతలు, కార్యక ర్తలు, అభిమానులు విషాదంలో మునిగి పోయారు. ఈరోజు పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లిలో మధ్యా హ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జీవిత విశేషాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
2000 సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ లో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
2001లో నల్లబెల్లి మండలం నుంచి జడ్పిటిసి సభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతిని ధిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యే గా అసెంబ్లీలో అడుగు పెట్టారు.


