హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తరువాత గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికలు జరుగు తుండడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఉత్సాహం నెలకుంది, పదేళ్ల విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగు తుండడంతో కార్మిక సంఘాలన్నీ ప్రచార పర్వంలో మునిగిపో యాయి.
దీంతో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కొంచెం కొంచెం వేడె క్కుతుంది,ఎన్నికల్లో పోటీ చేస్తున్న 12 సంఘాలకు హైదరా బాద్ జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు నిచ్చెన,గుర్తు కేటా యించగా.. మిగతా గుర్తింపు కార్మిక సంఘాలకు కత్తెర, బస్సు, బస్సు టైరు, పులి, ధర్మచక్రం, బాణం, నక్షత్రం, చేతిలో కాగడా, గధ, బతుకమ్మ, తదితర గుర్తులు కేటాయిం చారు. అక్టోబరు 9న రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. అదే నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేం దుకు అనుమతి ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. గుర్తులు ఖరారు కావడంతో సంఘాలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.
సుమారు దశాబ్ద కాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగు తుండటంతో సంస్థపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రధాన సంఘాలన్నీ వ్యూహాలు రచిస్తు న్నాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘానికి ప్రత్యేక అధికారాలు లభిస్తాయి.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తిం పు సంఘం కీలక పాత్ర పోషించనుంది. పలు సంఘాలకు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలపడంతో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


