హైదరాబాద్, నిఘా న్యూస్ : భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ విషయంలో అనేక కొత్త నిబంధ నలు చోటుచేసుకు న్నాయి, బుకింగ్ నియమాల నుండి సిలిండర్ డెలివరీ నియమాల వరకు అన్ని మారిపోయా యి వాణిజ్య గృహ వినియోగ సిలిండర్ల ధరలు రెండుసార్లు పెరిగాయి,
ఈ నేపథ్యంలోనే ఈ -కేవైసీకి సంబంధించి ఒక కొత్త నియమం నిర్దేశించారు.గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16 లోగా తప్పని సరిగా ఈ-కేవైసీ పూర్తిచేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడే తిప్పలు తప్పించేం దుకు డెలివరీ సిబ్బం ది ద్వారా ఇంటి వద్ద కే ఈ-కేవైసీ సౌకర్యా న్ని అందుబాటులోకి తెచ్చినా.. ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్‌దారు విదేశాల్లో ఉండటం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతోపాటు…
ఆధార్, గ్యాస్ వివరా ల్లో తేడాలు, ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించక పోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతు న్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్‌పై పడటంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది.
దీంతో రాష్ట్రంలోనూ సరఫరా ఆలస్యం, బుకింగ్ డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యం లో అందుబాటులో ఉన్న ఎల్పీజీని నిజ మైన గృహ వినియో గదారులకే అందించ డంతోపాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలం గా వినియోగంలో లేని కనెక్షన్లను గుర్తిం చి తొలగించడంపై చమురు సంస్థలు దృష్టి పెట్టాయి.
వినియోగదారు ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసం ధానం చేయడం ద్వారా.. అసలు లబ్ధి దారును గుర్తించేం దుకు ఈ-కేవైసీని విస్తృతంగా అమలు చేస్తున్నాయి.


