నామినేటేడ్ పదవుల విషయంలో పురుమల్ల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
రెండు వర్గాల మధ్య తోపులాట
కరీంనగర్, నిఘాన్యూస్:కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో కలకలం ఏర్పడింది. సోమవారం నగరంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం ఆందోళనకరంగా మారింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఇరు వర్గాల మధ్య తోపులాటకు కారణమైంది. ఇన్నాళ్లు ముసురుకున్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నామినేటేడ్ పదవుల విషయంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్ పెరుమాళ్ ఎదుటే నాయకులు వాగ్వాదాలకు దిగడం చర్చ నీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లాలో ఎన్నాల్లో ముసురుకుంటున్న వివాదం ఒక్కసారిగా బయటపడింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శితోపాటు జిల్లా పరిశీలకులు హాజరయ్యారు. ఇందులో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడులూ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడిచినా కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో అసంతృప్తి ఉన్నట్లు చెప్పుుకొచ్చారు. పెరిగిపోతున్నదని అన్నారు. తాను కొందరికి నామినేటేడ్ పదవులు ఇవ్వాలని కోరగా.. హైదరాబాద్ లో ఓ నాయకుడు అడ్డుకున్నాడని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని కొందరు నాయకులు స్టేజీపైకి వెచ్చి పురమల్ల శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం.. తోపులాటకు దారి తీసింది. దాదాపు అరగంట సేపు నాయకుల మధ్య వాగ్వాదం జరగడంలో అక్కడున్న నాయకులు షాక్ కు గురయ్యారు. అయితే కొందరు హైదరాబాద్ లో ఉన్న నాయకులు మంత్రి పొన్నం ప్రభాక్ ను ఉద్దేశించినవేనా? అని చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా సొంత పార్టీపైనే ఇలా వ్యాఖ్యలు చేసిన పురుమల్ల శ్రీనివాస్ పై కొందరు ఫిర్యాదులు చేశారు. అయితే గతంలో ఇలా వ్యాఖ్యలు చేసిన పురమల్ల శ్రీనివాస్ పై ఫిర్యాదు చేయగా క్రమశిక్షణ కమిటీ ఆయను షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానికి పురమల్ల జవాబు కూడా ఇచ్చారు. ఆ వివాదానికి అప్పుడు తెరపడింది. మళ్లీ ఇప్పుడు కొత్త వివాదం తలెత్తింది. అయితే ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పార్టీ బార్డర్ తప్పిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం హెచ్చరించారు. అయితే లోలోపల ఇలా ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఎప్పటికైనా బయటపడుతాయని అనుకుంటున్నారు.