Monday, August 24, 2026

నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలి:ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,పరిశీలించారు నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను అయన సోమవారం పరిశీలించారు.

నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.సాధ్యమైనంత వరకు త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారు లను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు సంబంధిత అధికారు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular