హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర పరి పాలన నిర్ణయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది, తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని ఈనెల 21 తేదీన నిర్వహించవలసి ఉండగా.. సరస్వతీ పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 23 కు మారుస్తూ.. నిర్ణయం తీసుకుంది,
కాగా..మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి హైదరాబాద్‌లోని సచివాలయంలో కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలతోపాటు.. పాలనా పరమైన నిర్ణయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
రేపు 23వ తేదీన యాదగిరిగుట్టలో వేద పాఠశాలను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభించనుండటం గమనార్హం. మంత్రివర్గ సమావేశం అంటే రాజ ధాని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. రాష్ట్ర ప్రజలకు, పుణ్యక్షేత్రాల వద్దకు ప్రభుత్వ పాలనను తీసుకెళ్లాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ నలో భాగంగానే ఈ సరికొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కేబినెట్ భేటీని నిర్వహించడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఆధ్యాత్మిక, రాజకీయ సందేశాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి, భావిస్తున్నట్లు సమాచారం.


