Sunday, August 23, 2026

తెలంగాణ పోరాట యోధులను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ప్రాణం పోసిన మహనీయుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవి అని కొనియాడారు. గద్దర్‌ వర్ధంతి నేప థ్యంలో ఆయన సేవ లను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం శ్రమిం చిన మహానియుడు ఉద్యమ చిరునామా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా నౌక కవి, ఉద్యమకారుడు గద్దర్ వర్ధంతులను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.

గద్దర్‌తో పాటు… ప్రొఫెసర్ జయశంకర్ కు తనకున్న ఆత్మీ య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన గద్దర్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించినప్పటికీ.. ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నించ కుండా.. సమాజం లోని పేద, బడుగు, బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

ప్రతి మనిషికీ కూడు, గూడు దక్కాలనే మహోన్నత లక్ష్యంతో జీవితాంతం పాటనే ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాం తం కోసం చివరి వరకు అంకితభావం తో పనిచేశారని అన్నారు.

తెలంగాణ ద్వేయం గా లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలం గాణ ప్రాంతానికి జరిగిన అన్యాయా లను ప్రజలు ఎదు ర్కొంటున్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ కి దక్కిందని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన మహనీయులను సీఎం గుర్తుచేశారు. వాళ్ల జయంతి, వర్ధంతి, కార్యక్రమా లను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular