అమరావతి, నిఘా న్యూస్: కూటమి సర్కార్ ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది, ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు అమలు చేసేందుకు మహిళ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈరోజు సంబంధిత అధికారులతో సమావేశ మైన సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ ఇవ్వాలని, అధికా రులను ఆదేశించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారని ఇంకా ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయో అలానే 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు టిక్కెట్‌లో పొందుపరచాలని అధికారులకు సూచించారు.
సచివాలయంలో మహిళల కు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ది పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికుల అందరికీ సులభంగా తెలుస్తుందని సీఎం అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడిందోనని అలానే మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై సీఎం చర్చించారు.