Wednesday, October 14, 2026

తెలంగాణలో అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రాష్ట్రంలో తొలిసారి నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో 70.07% మంది ఉపాధ్యాయు లు పాసయ్యారు. ఇప్పటివరకు నిర్వహించిన టెట్ లలో ఇదే రికార్డు స్థాయి ఉత్తీర్ణత, పేపర్ 1.2, లకు కలిపి 24.986 మంది దరఖాస్తు చేసుకోగా, 22 వేల 477 మంది పరీక్షలు రాశారు. అందులో 15,749 మంది అర్హత సాధించారు.

దీనిలో భాగంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ శనివారం మధ్యాహ్నం తన కార్యాలయంలో పేపర్ 1 టెట్ ఫలితాలను విడుదల చేశారు.

అక్టోబర్ 1న మరో నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్ రెండో విడత నోటిఫి కేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయను న్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ఉపా ధ్యాయుల బోధనా సామర్థ్యాల ను మెరుగుపరచడం, వారికి సకాలంలో పదోన్నతులు, అవకా శాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఈ పరీక్షలను నిర్వహిం చాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే మొదటి విడత టెట్‌ను విజయవం తంగా నిర్వహించి, తాజాగా నేడు వాటికి సంబంధించిన ఫలితాలను కూడా విద్యాశాఖ అధికా రికంగా విడుదల చేసింది.

ఈ తాజా ఫలితాల ప్రకటన ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకా లను నింపుతోంది. టెట్ లో అర్హత సాధించలేని వారికి ఇది మరొక అవకాశం అని చెప్పవచ్చు. అయితే మొదటి విడత టెట్ విజయ వంతంగా ముగిసిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి అక్టోబ ర్ 1న వెలువడనున్న రెండో విడత నోటిఫికేషన్‌ పైనే కేంద్రీకృతమైంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular