Thursday, October 15, 2026

వరంగల్ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణ పనుల్లో మరో ముందడుగు

వరంగల్, నిఘా న్యూస్: వరంగల్‌ ఎయిర్‌ పోర్టు పనుల విషయంలో కీలక పరిణామం చేసుకుం దనే చెప్పాలి ఎందు కంటే ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండి యా తొలి టెండర్‌ను ఖరారు చేసి.. కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లు వెచ్చించి సేకరించిన 283 ఎకరాల భూమి కి రక్షణ గోడతో పా టు… ప్రస్తుతం ఉన్న పాత ప్రహరీ ఎత్తు పెంచేందుకు హైదరాబాద్‌కు చెంది న సైదాక్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పనులు అప్పగించిం ది.

అందరి కంటే తక్కువ ధరకు పనులు చేసేందుకు సైదాక్స్‌ కంపెనీ ముందుకు రావడంతో సెప్టెంబరు 29న కాంట్రాక్టును ఖరారు చేసింది. కొత్తగా సేకరించిన భూమికి రక్షణగోడ తోపాటు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ బీసీఏఎస్‌ నింబంధనలకు అనుగుణంగా పాత ప్రహరీ ఎత్తు పెంచాలని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం 2028 జూన్ నాటికి ఎయిర్ పోర్టు ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది

ఈ ప్రాజెక్టు పూర్తయి న తర్వాత వరంగల్ ప్రాంతంలో విమానయాన సేవలు మరింత మెరుగుపడ తాయి. ఇది స్థానిక ప్రజలకు వ్యాపారు లకు పర్యాటకులకు ఎంతో ఉపయోగక రంగా మారనుంది. అంతేకాకుండా వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular