కరీంనగర్, నిఘా న్యూస్: చదవులతల్లి సరస్వతి మాతను ఆరాధించడం వలన సకల శుభాలు కలుగడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని అల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో ఎ.సి కళాశాలలో వసంత పంచమి (శ్రీ పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా ఏర్పాటుచేసినటువంటి” అల్ఫోర్ష్ వసంతపంచమి మహోత్సవ్-2024″ వేడుకలను వేద బ్రాహ్మణుల వేదమంత్రోత్సారణల మధ్య శాస్త్రోత్తంగా జ్యోతిప్రజ్వలన చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి మాతను ఆచరించిన వారికి బుద్ధి, ధనం సిద్ధించడమే కాకుండా ఘన విజయాలను సాధించి సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చని చెప్పారు. విద్యార్థులందరు ఉపాధ్యాయులు చూపెట్టిన మార్గాలను మరియు భోదించిన విషయాలను క్రమం తప్పకుండా అనుసరించి ముందంజలో ఉండాలని సూచించారు.

వసంత పంచమి చాలా విశిష్టమైన రోజు అని, ఈ రోజున అమ్మవారిని ఆరాధించిన వారికి కోరిన ఫలాలను పొందుతారని తెలుపుతూ ప్రత్యేకంగా అమ్మవారి పుణ్యక్షేత్రాలైన కాశ్మీర్ మరియు బాసరలో అత్యంత వైభవోపేతంగా వేడుకగా నిర్వహిస్తారని మరియు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఒక ఆనవాయితీగా వస్తున్నదని తెలుపుతూ ప్రతి విద్యార్థి కూడా ఈ రోజున ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించే విధంగా కృషి చేసి సమాజంలో అగ్రగామిగా నిలవాలని సూచించారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో వసంతపంచమి చాలా వైభవంగా జరుపుకుంటామని మరియు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో వేదమూర్తులైన బ్రాహ్మణులచే అమ్మవారికి ఫలపంచామృతాలతో, వివిధ పుష్పాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా భక్తిపారవశ్యంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్యమైన ఘట్టం సరస్వతి హోమాన్ని చాలా వైభవంగా నిర్వహించడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు అధికంగా ఉండాలని ప్రార్ధించడం జరిగినదని చెప్పారు.
దేశ వ్యాప్తంగా వసంత పంచమిని ఒక ఉత్సవంలా నిర్వహించుకుంటారని, ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉన్నదని వివిధ పురాణాల ద్వారా తెలుస్తున్నదని చెప్పారు. వసంత పంచమి నాడు పలు గ్రంథాలను అనగా వేదాలతో ఉన్నటువంటి వాటిని పఠించి ఉపవాసం పాటిస్తారని తద్వారా అమ్మవారి కృపాకటాక్షములు పొందుతారని చెప్పారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు చేసిన భజనలు, ఆలపించినటువంటి సరస్వతి స్తోత్రమ్ మరియు సరస్వతి అష్టోత్తరం, భక్తి పారవశ్యాన్ని నింపింది మరియు విచ్చేసిన వారందరికి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిద పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు