రామగుండం, నిఘా న్యూస్:ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రజ లకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబా టులో ఉండాలని, ఏ ఒక్క పరీక్షను కూడా బయటకు పంపిం చకుండా ఆసుపత్రి లోనే నిర్వహించేలా అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడు తూ…
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్ష లు నిర్వహించేలా అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన పరిక రాల వివరాలు, అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదన లను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రి అభివృద్ధి కి కేటాయించిన నిధులను సక్రమం గా, పారదర్శకంగా వినియోగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి క్రిటికల్ కేర్ బ్లాక్ వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


