Thursday, November 19, 2026

దీక్ష దివాస్ సభను విజయవంతం చేద్దాం: మాజీమంత్రి గంగుల కమలాకర్!

కరీంనగర్, నిఘా న్యూస్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచ రణ రూపొందించా లని, జన సమీకరణ నుంచి సభా నిర్వ హణ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సభకు వచ్చే ప్రజల కు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో మంగళవారం మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular