Thursday, November 19, 2026

గిగ్ వర్కర్లకు 5 లక్షల జీవిత బీమా: సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్‌ నగరం లో గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మహిళా గిగ్ వర్కర్ స్కూటీ డ్రైవ్ చేయగా.. వెనక కూర్చొని ఆయన ర్యాలీగా వెళ్లారు. మరో స్కూటీపై సీఎం రేవంత్ రెడ్డి, కూడా కూర్చొని ర్యాలీలో పాల్గొన్నా రు.మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నాయకులు ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ వెంట కదిలారు.

నగరంలోని హైటెక్ సిటీలోని హెచ్ఐ సీసీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ప్రపంచ నిర్మాణం పేరిట భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమం లో శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

గిగ్ వర్కర్లతో కలిసి రెండు కిలోమీటర్లు ర్యాలీ అనంతరం జయభేరి మైదానం లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రతి వర్కర్ కు ఐదు లక్షల జీవిత బీమా ప్రకటించారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఆరోగ్య భీమా కూడా ప్రకటించారు. భారత్ జూడో యాత్రలో గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ, ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరు స్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సభా వేదికపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట తెలంగాణ గిగ్ వర్కర్లను కలిశాను. వారిని కలిసిన సమయంలో వారి బాధలను తెలుసుకున్నాను. అప్పుడు వారికి ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇన్నాళ్లు గిగ్ వర్కర్లకు ఎంత డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి. గిగ్ వర్కర్ల చట్టంతో వర్కింగ్ అవర్స్, ఎంత డబ్బులు వచ్చాయో మొత్తం డేటా తెలుస్తుంది. గిగ్ వర్కర్లు రెస్ట్ తీసుకోవడానికి వైఫై ఉన్న ప్లేసులను ఏర్పాటు చేస్తున్నా మని అన్నారు. గిగ్ వర్కర్కు రూ.5 లక్షల జీవిత బీమా, రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్న ట్లు చెప్పారు. అంతేకాక.గిగ్ వర్కర్ ప్రతి డెలివరీ జరిగిన వెంటనే ప్రతి రూపాయి అకౌంట్లో పడతాయని తెలిపారు.

గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు ప్రయోజనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బోర్డు, ప్రతి కార్మికుడికి ఆధార్ అనుసంధానిత ప్రత్యేక గుర్తింపు కార్డులు కేటాయించ నున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular