హైదరాబాద్, నిఘా: న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) అధికారికంగా విడుదల చేసింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయిన విష యం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. పోలీస్ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 5,77.064 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి శ్రీనివాసరావు తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల రాత పరీక్ష షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES


