హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని పేర్కొంటూ రాష్ట్రంలోని 29 జిల్లాలకు ఎల్లో రంగు జారీ చేసింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల తీవ్రతకు పడిపోయే ప్రమాద ముందని అధికారు లు వెల్లడించారు.
దేశంలోని ఈశాన్య దిశ నుండి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న చలి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. దీనికి తోడు వేకువజాము నుండి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరిం చే అవకాశముంది.
మంచు ఎక్కువ కురిసే అవకాశం ఉన్నందువల్ల దారులు కనిపించకపోవచ్చువాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండా లని నిపుణులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంట ల్లో రాష్ట్రంలోనే అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలుగా నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో 14.7 నుంచి 15 డిగ్రీల మధ్య, 18 జిల్లాల్లో 15.1 నుంచి 19.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై నట్లు అధికారులు తెలిపారు.


