Sunday, August 30, 2026

బిజెపి గూటికి కొండ సురేఖ?

హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, ముఠా తగదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్న ట్లు తెలుస్తుంది, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ,గతంలో బీఆర్ఎస్ శ్రేణులతో తీవ్రస్థాయిలో శత్రుత్వం పెంచుకొని ఆ పార్టీని వీడి రావడం బిఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడం తో తిరిగి కెసిఆర్ గూటికి వెళ్లే పరిస్థితి లేదు, ఆ తలుపులు పూర్తిగా మూసుకుపో యాయి ఇక మిగిలిన ఒకే ఒక ప్రధాన జాతీయ పార్టీ బిజెపి, ప్రస్తుత రాజ కీయ సమీకరణల్లో కొండ సురేఖకు బీజేపీ పార్టీ వైపు చూడక తప్పని పరిస్థితి నెలకొంది, ప్రస్తుతం వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి కొండా సురేఖ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతు న్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం సురేఖపై క్రమశిక్షణా వేటు వేస్తే, ఆమెను తమ గూటికి చేర్చుకో వాలని కమలం నాయకత్వం గుట్టు చప్పుడు కాకుండా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖ ను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆమెకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమై నట్లు సమాచారం. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు న్న తెలంగాణకు చెందిన ఒక ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఇప్ప టికే కొండా మురళితో రహస్యంగా సంప్రదిం పులు జరుపుతున్నా రనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సెప్టెంబరు 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఒకవేళ సురేఖపై వేటు పడితే… కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌లో నే కొనసాగుతుందా? లేక కమలం తీర్థం పుచ్చుకుని హస్తం పార్టీకి షాక్ ఇస్తుందా? అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీకి బలమైన పునాదులు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో ఈ ప్రాంతా ల నుంచే ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, ఒకప్పుడు హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత సరైన మాస్ లీడర్ లేకపోవడంతో ఆ జిల్లాలో పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు కొండా దంపతుల రూపంలో ఒక బలమైన మాస్ లీడర్‌షిప్‌ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరిగి జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular