Friday, September 18, 2026

హైదరాబాద్ లో ముగ్గురు బాలికల అదృశ్యం?

హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం నగరంలో కలకలం రేపుతోంది. దోమల గూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుం బాలు దోమలగూడ లోని ఫరీద్ బస్తీలో నివాసం ఉంటున్నాయి.

అదే ప్రాంతానికి చెందిన సహిత కుమారి, స్నేహ కుమారి, లత అనే ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపో వడంతో వారి తల్లి దండ్రులు దోమల గూడ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీ లించారు. విచారణ లో బాలికలు మొదట హిమాయత్‌ నగర్‌లో ఓ ఆటో ఎక్కిట్లు గుర్తించారు. ఆ తర్వాత వారు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ట్లు సీసీటీవీ ఫుటేజీ లో నమోదైంది.

దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చిం ది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాలిక లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రెండు రైల్వే స్టేషన్ల లోని సీసీటీవీ ఫుటేజీ లను క్షుణ్నంగా పరిశీ లిస్తూ వారి కదలికల ను ట్రాక్ చేస్తున్నారు.

బాలికలు తమ స్వగ్రామమైన ఛత్తీస్‌ గఢ్‌కు వెళ్లి ఉండొచ్చ నే అనుమానంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు, ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ముగ్గురు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

బాలికలను వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular