హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్లోని మాదాపూర్, పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు, ప్రేమ వేధింపుల వివాదం భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురై నట్లు తెలుస్తుంది, మంగళవారం రాత్రి రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తో మాధాపూర్ ప్రాం తంలో తీవ్ర కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. మృతుడి పై ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరో పణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సె లింగ్ నిర్వహించిన ప్పటికీ భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు.ఈ మధ్యకాలంలో భాస్కర్,దమ్ముంటే హైదరాబాద్కు రండి చూసుకుందాం అంటూ సవాల్ విసిరి నట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ఓ యువతి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చి పథకం ప్రకారం దాడి చేశారు. హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగి పోయారు. మరోవైపు డయల్-100కు సమాచారం అంద డంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.ఘటనాస్థలికి క్లూస్ టీమ్ చేరుకుని కీలక ఆధారాలను సేకరిం చింది. అనంతరం భాస్కర్ మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వేధింపుల వివాదమే ఈ హత్య కు కారణమా.? లేదా ఇతర కోణాలు కూడా ఉన్నాయా.? అనే దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగు తోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.


