Wednesday, June 24, 2026

కాటారం అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

భూపాలపల్లి , నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, వివిధ ప్రభు త్వ శాఖల సమన్వ యంతో రాష్ట్రవ్యాప్తం గా అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పాటు, ప్రజా చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించను న్నారు

ఇందులో భాగంగా.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని ఐటిఐ,ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కాటారం మండల ఫారెస్ట్ రేంజ్ అధికారి, జే, స్వాతి, డిప్యూటీ రేంజ్ అధికారి సురేందర్, కాటారం వారి ఆధ్వర్యంలో గురువా రం పర్యావరణ పరి రక్షణపై విద్యార్థులకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు.

పెరుగుతున్న కాలు ష్యాన్ని నియంత్రించ డంలో, భవిష్యత్ తరాల మనుగడకు పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఇంటి వద్ద మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎఫ్ ఆర్ వో, జే, స్వాతి, ఈ సందర్భం గా అన్నారు.
అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను సాధించవచ్చని, ఈ సందర్భంగా విద్యా ర్థులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ ప్రజా చైతన్య కార్యక్రమాలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమానికి డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్, ఝా న్సీరాణి యామాన్ పల్లి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పి, చంద్ర శేఖర్, దామరకుంట, మొయినుద్దీన్, రాజేందర్, సంజీవ్, ప్రతి బాబు, తోపాటు..

కాటారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొంగర సుభాషిని, ఇంచార్జి ప్రిన్సిపాల్ బుర్ర రాజబాబుగౌడ్, ఆర్ యాకూబ్, పి తిరుపతి, దేవోజి, బి స్వామి, బి సంపత్, అనసూయ, తదిత రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular