Tuesday, June 2, 2026

భక్తులను అలరించిన భజన కార్యక్రమం

పెద్దపల్లి, నిఘా న్యూస్:. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాల యంలో అధిక జేష్ఠ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మహావాది సుధీర్, ఆలపించిన పాటలు భక్తులను అలరింప జేశాయి. మంగళవారం సాయంత్రం 6గంటల నుండి ఏడున్నర గంటల వరకు నిర్వ హించిన ఈ భజన కార్యక్రమంలో “మాతో హే మా మాతోహే మా మా జేసే దునియా మే హై కోయి కహా ” , దేకో హో దివానో తుమ్హే కామ్ నా కరో రామ్ క నామ్ బదనామ్ నా కరో లాంటి హిందీ భక్తి గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అధిక జేష్ఠ మాసము ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఈ భజన కార్యక్రమంలో మహవాది సుదీర్ పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ తెలిపారు. భజన కార్యక్రమం అనంతరం సాయి బాబాకు శేజా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజనపరులు అవధా నుల శ్రీనివాస్, యజ్ఞం భట్ల లక్ష్మీరాజ్యం, తల్లం శ్రీనివాస్ తో పాటు పలువురు భజన పరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular