Wednesday, June 24, 2026

రేపటి నుంచి కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం నూతన శోభను సంతరించు కుంది గురువారం నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇక్కడ సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనం గా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది,

ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక చొరవ తీసుకొని గత ఏడాది జరిగిన పుష్కరాల మాదిరి అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచిం చడంతో అధికార యంత్రాంగం కొన్ని రోజులుగా శ్రమి స్తుంది, ముఖ్యమంత్రి పలువురు మంత్రులు వచ్చే అవకాశం ఉండడంతో గోదావరి తీరం వద్ద హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. రేపు తెల్లవారుజాము న 5:43 గంటలకు అంత్య పుష్కర ముహూర్తంగా పండి తులు నిర్ణయించారు.

ఈ పుష్కరాలకు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రద్దీకి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతు లను కల్పించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వెల్లడిం చారు. హైదరాబాద్‌ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో పుష్కరా ల ఏర్పాట్లపై తాజాగా ఉన్నత స్థాయి సమీక్షా సమా వేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దేవాదాయ, విద్యుత్, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడు తూ… వివరాలను వెల్లడించారు. మే 21వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించి ఈ అంత్య పుష్కరాలను అధికా రికంగా ప్రారంభిస్తారని తెలిపారు.

పుష్కరాల ప్రారంభో త్సవంలో కంచి స్వా మీజీతో పాటు…రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొ ని పవిత్ర స్నానాలు ఆచరిస్తారని పేర్కొన్నా రు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక దర్శన లైన్లు, వివిధ పీఠాధిపతులకు ప్రోటోకాల్ వసతులు, ఘాట్ల వద్ద నిరంతర పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ మరియు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular