Thursday, April 23, 2026

చదువు రాని నీకేం తెలుసు అభివృద్ధి గురించి!

పెద్దపల్లి, నిఘా న్యూస్: అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పై అసత్య ఆరోపణలు చేయడం తగదని,విద్యావంతుడు, విజ్ఞానవంతులైన మా నాయకుడు మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు,అని అలాంటి మహానాయకు డిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకో వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, మాజీ జడ్పిటిసి పుట్ట మధును హెచ్చ రించారు. గురువారం ఆయన కాంగ్రెస్ నాయ కులతో కలిసి డివిజన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…..

ఈనెల 20న కాటారం మండలంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, భారీ బహిరంగ సభ విజయ వంతం కావటంతో ఓర్వ లేకనే పుట్ట మధు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతు న్నాడని,అది అయన అవివేకానికి నిదర్శనమని, అన్నారు. దొంగ నోట్లు, సారా కాంట్రాక్టులు, కర్ర బిజినెస్, గంజాయి స్మగ్లింగ్లు చేసిన నీకు ఏం తెలుసు అభివృద్ధి గురించి పుట్ట మధు…

ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, అందరికీ ఆదర్శనీయుడని ఆయన పేర్కొన్నారు. విద్యావంతుడైన శ్రీధర్ బాబు, హయంలో అనేక విద్యాసంస్థలు, నెలకొల్పి యారని, చదువురాని నీకు ఏం తెలుసు ఆని ప్రశ్నించారు.

అవగాహన లేకుండా చిల్లర మాటలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావ ని,ఆయన ఎద్దేవ చేశారు. మా నాయకులు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే త్వరలోనే నీకు ఈత బరిగలతో దేహశుద్ధి తప్పదని, ఆయన హెచ్చ రించారు. మా నాయకుడు మాకు సంయమనం పాటించమని చెప్పబట్టి మేము ఓపికతో ఉన్నా మని మేము సహనం కోల్పోతే నీవు బయట తిరిగే పరిస్థితులు ఉండవని పుట్ట మధుకు సూచించారు.

సభ్యత సంస్కారం గురించి ఏమాత్రం తెలియని నీకు శ్రీధర్ బాబు, శీను బాబు,ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకోవడానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉందని మీ నాయకుని పాలన మూలంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు.

అనంతరం ఆరెంద గ్రామ శాఖ అధ్యక్షుడు ఉల్లి అనిల్ రెడ్డి,మాట్లాడుతూ 103 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు శ్రీధర్ బాబు చలువతో ప్రారంభమయ్యా యని తెలిపారు. అలాగే మీ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పంటలు నష్టపోయిన రైతులకు11 లక్షల 50 వేలు ఇప్పిస్తామని ఘోరంగా మోసం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నాగుల రాజయ్య, ఈసంపల్లి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, లక్కే పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈసంపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్, ఇందారపు అనిల్ లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular