Tuesday, April 14, 2026

మంథనిలో ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

పెద్దపల్లి, నిఘా న్యూస్:13ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు, 27వ వర్ధంతి సందర్భంగా మంథని పట్టణంలోఐటీ మంత్రి శ్రీధర్ బాబు,తో పాటు.. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మున్సి పల్ సిబ్బందికి శ్రీపాద రావు, చిత్రపటాలనుఅంద జేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మా తండ్రి చూపిన బాట లో నడుచుకుంటున్నాని, ఆయన స్ఫూర్తితో శక్తి వంతన లేకుండా పనిచేస్తా మన్నారు.విద్య,వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆనాడు శ్రీపాదరావు, చెప్పిన మాటల స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు,తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, మాట్లాడు తూ… శ్రీపాదరావు విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అజాత శత్రువు గా పేరున్న శ్రీపాదరావు, ఆనాడు కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ.. కార్యకర్తల కష్టసుఖాల్లో భాగమయ్యారని మంత్రి అన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు, రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు, రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారని తన లాంటి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు కేబినెట్లో అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు అని మంత్రి కొనియాడారు. మంత్రి శ్రీధర్ బాబు, సహకారంతోనే రాష్ట్ర బడ్జెట్లో తన శాఖకు 17 వేల కోట్లు కేటాయించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular