Tuesday, April 14, 2026

రేపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలోని ఇంటర్మీడి యట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారు అయింది రేపు 12వ తేదీన ప్రథమ, ద్వితీయ, సంవ త్సర ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది….

రేపు ఆదివారం మధ్యా హ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం నూత న సిలబస్ పుస్తకాలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది ఉండగా.. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు.

సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే ముగిసింది. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయి లైన విద్యార్థుల సమాధా నపత్రాలను ఈసారి కూడా మళ్లీ మూల్యాంకనం చేశారు. ఆ ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తయింది. దీంతో ఫలితాల విడు దలకోసం ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular