Sunday, April 19, 2026

పిట్టల ఎల్లయ్యపల్లిలో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులు!

జిల్లా :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తు న్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కలిగినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా మెరుగుపడతాయని, గ్రామాల అభివృద్ధి పరమవాధిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఈరోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామంలో 15 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు.. రూ. 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ విజయ రమణారావు, భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమ ణారావు, మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల మూడు మాసల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకోవడం జరిగింది అని అన్నారు. ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ప్రజా ప్రభుత్వంలో పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 65 లక్షలు రూపాయల నిధులతో గ్రామ అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది అని తెలిపారు.

పాఠశాల కాంపౌండ్ వాల్ మరియు అంగన్వాడీ భవనం, మహిళా ఐకేపీ సంబంధించిన మహిళా సమైక్య భవనం కోసం వారం రోజుల్లో 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గ్రామప్రజల ఆలోచన మేరకే గ్రామ అభివృద్ధికి మంచి ప్రణాళికలు వేసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకుందామని అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular