హైదరాబాద్, నిఘా న్యూస్:బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సోమవారం బాసర సరస్వతి ఆలయంలో రూ” 225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యా హ్నం1 గంట వరకు అక్షరా భ్యాసం కుంకుమార్చనలు సత్యనారాయణ వ్రతాలు వంటి అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లా బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలా బాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొనను న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో తొలుత నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రూ.225 కోట్లతో పునర్ నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయిం చింది..
జ్ఞాన సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశా లతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందిం చారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు.
వారి సూచనలకు అను గుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.


