పెద్దపల్లి, నిఘాన్యూస్: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో ఎట్టకేలకు లొంగుబాటుకు ముందుకు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పోలీసుల ను ముప్ప తిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరించడానికి, బలపర్చడానికి వ్యూహకర్తగా, ప్రజా శతృవుల నిర్మూలన కోసం నిర్వహించే ఆపరేషన్లలో కీలక, సంచలన నేతగా గుర్తింపు పొందిన కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఆలియాస్ మీసాల సత్తన్న కొద్దిరోజుల క్రితం పోలీసు లకు లొంగిపోయారు.ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రుల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డిని మంథని పట్టణానికి చెందిన మాజీ జెడ్పిటిసి మూల సరోజన, పురు షోత్తం రెడ్డి, దంపతు లు హైదరాబాద్ లో పోలీసుల ఆధీనంలో ఉన్న మల్లా రాజిరెడ్డిని శనివారం స్నేహపూర్వకంగా కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నట్లు సమాచారం.
మాజీ మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డిని కలిసిన మాజీ జెడ్పిటిసి మూల పురుషోత్తం రెడ్డి దంపతులు
RELATED ARTICLES


