Monday, April 20, 2026

కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అపశ్రుతి..

చలువ పందిరి కూలి 15 మందికి తీవ్రగాయాలు?!

జగిత్యాల, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండ గట్టు అంజన్న ఆలయంలో ఈరోజు ఉదయం అపశృతి చోటుచేసుకుంది,ఈరోజు నుండి మొదలైన చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది..

ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లే ఈ దుర్గటన జరిగిందని ఆరోపిస్తున్నా రు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో హనుమాన్ మాల విరమణ కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు కూడా వేశారు. ఈ క్రమంలో నాసిరకంగా వేయడంతో చలువ పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular