Monday, April 20, 2026

నేటి నుండి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లెస్ పేమెంట్స్!

హైదరాబాద్, నిఘా న్యూస్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది, ఈక్రమంలోనే ఏప్రిల్ 1న వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు.

నేషనల్ హైవేల మీద ప్రయాణించేవారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి అంటే ఈరోజు నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. దీని గురించి జాతీయ రహదారుల సంస్థ గత నెలలోనే ప్రకటించింది.

ఆ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి నేషనల్ హైవేల మీద ప్రయాణించే వాహనదా రులు.. ఇకపై టోల్ ఫీజులను ఫాస్టాగ్, లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.

మిగతా సమయాల్లో ఎలా ఉన్నా పండగ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపులో ఆలస్యం కారణంగా కిలోమీటర్ల మేర రోడ్డు మీద బారులు తీరి ఉంటాయి. ఈక్రమంలో వాహనాల రద్దీని తగ్గించి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. సు మారు 98 శాతం నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో ఇప్ప టికే టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి.

అయితే దీన్ని పూర్తి స్థాయి లో డిజిటల్‌కు మార్చాలనే ఉద్దేశంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల.. టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడం మాత్రమే కాక.. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించ కుండా త్వరగా వెళ్లేందుకు దోహదం పడుతుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular