హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిధి*:మార్చి 31తెలంగాణలో చికెన్ ప్రియులకు ఒక చేదు వార్త! ఎందుకంటే రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. నిరవధిక బంద్ పాటించనున్నట్లు చికెన్ దుకాణాల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమాను లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేజీకి రూ.15 నుంచి రూ.20గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కి తగ్గించటంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు.గతంలో ఉన్న ధరను భట్టే తాము పలు హోటళ్లకు, బల్క్‌గా చికెన్ తీసుకునే వారితో అగ్రిమెంట్ కుదు ర్చుకున్నట్లు తెలుపుతు న్నారు. సడెన్‌గా ధరలు తగ్గిస్తే తమకు నష్టం ఉంటుందని చెప్పారు. గతంలో ఇచ్చిన విధంగా పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతకు ముందు హోల్‌సేల్ దుకాణాల్లో హయ్యెస్ట్ లైవ్ చికెన్ ధర రూ.120- 130 ఉండేదని.. ప్రస్తుతం రూ.180- 190 ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 గ్రాముల వేస్టేజ్ పోతే రూ.15 నష్టపోతున్నామ న్నారు. అదనంగా ఖర్చు రూ.18 వస్తుందని అన్నీ పోగా తమకు మిలిగేది లేకపోగా.. ఉల్టా జేబుకు చిల్లు పడుతుందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు.తమ న్యాయమైన డి మాండ్లను పౌల్ట్రీ కంపెనీలు పరిష్కరించా లని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టా లని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని విజయ వంతం చేయాలని అసోసి యేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగు తుందని, చికెన్ దుకాణా లు మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్వహరి స్తామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. చికెన్ దుకాణాల బంద్‌కు వినియోగదారులు కూడా సహకరించాలని కోరుతున్నారు.
రేపటి నుండి చికెన్ షాపులు బంద్?
RELATED ARTICLES


