Monday, April 20, 2026

శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైన కొండగట్టు

జగిత్యాల, నిఘా న్యూస్జి:సీతారాముల కళ్యాణం వేడుకకు ఆలయం అంత సిద్ధమైంది,కొండగట్టు ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు.,జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి శోభ కనిపిస్తుంది.ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిల్లు రంగురంగుల దీపాలతో, పుష్పాలంకరణలతో సింగారమై భక్తులను ఆహ్వానిస్తోంది. శ్రీరాముని జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వ హించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించేం దుకు సిద్ధమవుతున్నారు. రామనామస్మరణతో కొండగట్టు ఆలయం ప్రాంగణం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది దూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశ ముండడంతో, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, శ్రీరామ నవమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు, రామపట్టాభిషేకం, సీతారామ కళ్యాణం వంటి వైభవోత్సవాలు నిర్వహిం చనున్నారు. కొండగట్టు క్షేత్రం భక్తజనాలతో కళకళలాడేందుకు సిద్ధమవుతోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular