కరీంనగర్, నిఘా న్యూస్ : జిల్లా: మార్చి 25కరీంనగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల భయాందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ ఏర్పడుతుందని అన్నారు.పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడు తుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబా టులో ఉన్నాయన్నారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి కొరత లేదు. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దు..
సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని కమిషనర్ హెచ్చరించారు.ప్రజలు శాంతంగా ఉండా లి. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవు, కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచా రాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా సీపీ హెచ్చరించారు .


