హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం కీలక సమీక్ష నిర్వహించనున్నా రు. అసెంబ్లీ కమీటీ హాలు లో మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.
ఇందన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. మరో వైపు పెట్రోల్ కొరత లేదని.. భయాందోళన వద్దని సివిల్ సఫ్లయ్ శాఖ సూచిస్తుంది. పెట్రోల్ డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ఇప్పటికే పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి. భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్ల వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా ఉంచేందుకు ఆయిల్ కంపెనీలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించాయి.


