Monday, April 20, 2026

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి..

సిఐటియు జిల్లా నాయకులు బూడిద గణేష్

పెద్దపల్లి, నిఘా న్యూస్: అంగన్‌వాడీలు ఎదుర్కొం టున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, అన్నారు.

సమస్యలు పరిష్కరించా లని కోరుతూ మంగళవారం తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బూడిద గణేష్, మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు మార్చి నెల నుండి ఒంటిపూట బడులు నిర్వహణతో పాటు మే నెలలో టీచర్స్, హెల్పర్లకు ఇద్దరికి ఒకేసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ. 18,000/-ల వేతనంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా నేటికి అమలు చేయలేదని విమర్శించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు. జీఓ నెం.14ను సవరించాల‌ న్నారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు కే కుమారి, స్వరూప,మండల సుగుణ, శోభ,సులోచన, భాగ్య, సుజాత, తదితరులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular