భూపాలపల్లి, నిఘా న్యూస్: భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25న పోలీస్ మెగా మెడి కల్ క్యాంపు నిర్వహిస్తు న్నట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్, మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహా ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడ పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈమెగా క్యాంపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ మెడికల్ క్యాంప్ శిబిరంలో సుమారు 5,000 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామ న్నారు. ఈ క్యాంప్ లో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం, తో పాటు భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు సేవలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహా ముత్తారం మండలంలోని మారుమూల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి సూచించారు.


